మంగళగౌరిగా రుక్మిణి వసంత్.. పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో సరికొత్త అవతారం!

మంగళగౌరిగా రుక్మిణి వసంత్.. పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో సరికొత్త అవతారం!

బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్‌‌‌‌తో ప్రేక్షకులను పలకరిస్తున్న రుక్మిణీ వసంత్.. ప్రస్తుతం ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది. ‘మంగళగౌరి’ టైటిల్‌‌‌‌తో రూపొందుతున్న ఈ కన్నడ చిత్రంలో ఆమె కానిస్టేబుల్ పాత్రలో నటిస్తోంది. కన్నడలో ఉమెన్ సెంట్రిక్‌‌‌‌ యాక్షన్‌‌‌‌ రోల్స్‌‌‌‌కు కేరాఫ్​ అడ్రస్‌‌‌‌ అయిన మాలాశ్రీ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. మంగళవారం ఈ మూవీ నుంచి ఓ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఇందులో భుజంపై లాఠీతో సీరియస్‌‌‌‌ లుక్‌‌‌‌లో రుక్మిణీ వసంత్ కనిపిస్తుండగా, చేతిలో గరిటెతో ఇంటెన్స్‌‌‌‌ లుక్‌‌‌‌లో మాలాశ్రీ కనిపించడం సినిమాపై ఆసక్తిని రేపుతోంది.  

రాహుల్ పీకే దర్శకత్వం వహిస్తున్నారు.   క‌‌‌‌న్నడ దర్శకుడు హేమంత్ రావ్‌‌‌‌తో కలిసి కేవీఎన్‌‌‌‌ ప్రొడక్షన్స్‌‌‌‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.  అనుకోకుండా ఎదురైన కొన్ని క్లిష్ట పరిస్థితులను ఇద్దరు మహిళలు ఎలా ఎదుర్కొన్నారు అనేది ప్రధాన కథాంశం. లక్నో బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రుక్మిణీ వసంత్‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఫస్ట్ లేడీ ఓరియంటెడ్‌‌‌‌ సినిమా ఇది. వరుస పరాజయాల్లో ఉన్న రుక్మిణికి ఈ చిత్రంతో సక్సెస్ లభిస్తుందేమో చూడాలి!